KTR: అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది..! 12 d ago
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై ఫైర్ అయ్యారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అంటూ ప్రశ్నించారు. కూల్చివేతలు, ఎగవేతలు, కరెంటు కోతలు, చిన్నారుల చావులు, కోడెల అమ్మకాలు, అల్లర్లు, అబద్ధాలు, పగలు, ప్రతీకారాలు, దాడులు, దౌర్జన్యాలు, ధర్నాలు, దీక్షలు, ఢిల్లీ టూర్లు, అప్పులు, తప్పులు, డైవర్షన్లు, స్టంట్లు, బూతులు, లూటీలు, కేసులు, అరెస్ట్లు.. ఇవేనా? అని ప్రశ్నించారు. ఇంకేమైనా ఉంటే చెప్పండి.. అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.